Wednesday, April 22, 2026
HomeNewsబుచ్చియ్యపేటలో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

బుచ్చియ్యపేటలో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

 

జయ జయహే

స్థానిక శాఖా గ్రంథాలయంలో శుక్రవారం 58వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి వి.కృష్ణారావు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని నెహ్రూ జయంతి వేడుకలు, బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపియుపి స్కూల్ హెచ్ఎం సూర్యనారాయణ రావు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.దేశ ప్రధానిగా నెహ్రూ అందించిన సేవలను బాలలకు వివరించారు.గ్రంథాలయాల ప్రాధాన్యాన్ని వివరించారు.పుస్తక పఠనం గ్రంథాలయ సందర్శన అలవాటు చేసుకోవాలన్నారు. గ్రంథాలయాలు జ్ఞానాన్ని, చరిత్రను, కళలను భద్రపరిచే ప్రదేశాలని, ఇవి పుస్తకాలు, వ్రాతప్రతులు, పత్రికలు, డిజిటల్ వనరులు వంటి అనేక రకాల సమాచారాన్ని అందిస్తాయన్నారు. ప్రజలు విజ్ఞానం పొందడానికి, తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి గ్రంథాలయాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఉపాధ్యాయురాలు భానుమతి పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments