Tuesday, April 21, 2026
HomeSportsకుస్తీ పోటీల్లో సత్తాచాటిన ఎపిటీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు.

కుస్తీ పోటీల్లో సత్తాచాటిన ఎపిటీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు.

కుస్తీ పోటీల్లో సత్తాచాటిన ఎపిటీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు.

కొయ్యూరు జయ జయహే న్యూస్.

అల్లూరి జిల్లా,కొయ్యూరు ఎపిటీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల(బాలురు)విద్యార్థులు రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో తమ ప్రతిభను ప్రదర్శించారు.విజయవాడలో నవంబర్ 28న జరిగిన అండర్-19,అండర్-17 విభాగాల కుస్తీ పోటీల్లో కళాశాల విద్యార్థులు పతకాలు సాధించి కళాశాలకు గౌరవం తీసుకువచ్చారు.ఇంటర్ మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సిహెచ్. కార్తీక్, ఇంటర్ మీడియట్ ప్రధమ సంవత్సరం విద్యార్థి జి. దుర్గ ప్రసాద్ బంగారు పథకాలు గెలుచుకోగా.ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కె.జయరాం,కె. రామదాసులు రజత పథకాలు సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. లక్ష్మణుడు,వైస్ ప్రిన్సిపాల్ సిహెచ్.అచ్చన్న, పీడీ ఉదయ్,బోధన సిబ్బంది విద్యార్థులను అభినందించారు.పతకాలు సాధించిన విద్యార్థులు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments