Home Politics Andhra Pradesh నిత్య కృషీవలుడు నరసింహరాజు

నిత్య కృషీవలుడు నరసింహరాజు

0

నరసింహరాజు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మార్నింగ్ కాఫీ క్లబ్

30 ఏళ్లుగా డిఎన్నార్ కళాశాల అభివృద్ధికి కృషి చేసి నాక్, నాక్ డబుల్ ప్లస్, కళాశాల స్థాయిని దేశంలోనే చాటి చెప్పిన మహోన్నత కృషి వలుడు నరసింహరాజు అని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్,పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు అన్నారు. భీమవరం డిఎన్నార్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు పుట్టినరోజు సందర్భంగా వారికి మార్నింగ్ కాఫీ క్లబ్ తరుపున శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు. వారు మాట్లాడుతూ డిఎన్నార్ కళాశాల అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రామికునిగా పని చేసే వ్యక్తి నరసింహరాజు అని, ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. సభ్యులు జూలూరి రాజా తన కవితతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం లో తటవర్తి బదరి, బొడ్డు వాసు, గాదె నాగేశ్వరావు, పులవర్తి రామకృష్ణ పున్నని కన్నయ్య కురిశెట్టి శ్రీనివాస అప్పారావు,కార్యక్రమంలో పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version