Home Politics Andhra Pradesh ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

0

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం ఉనకరమిల్లి గ్రామం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉనకరమిల్లి వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలకు ముఖ్య అతిధిగారాష్ట్ర పర్యాటక, సంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు హాజరై కల్యాణ మహోత్సవాన్ని తిలకించి, స్వామివారిని దర్శించుకున్నారు ఈ మహోత్సవాలను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు పోలిరెడ్డి నారాయణస్వామి, రామకృష్ణవేణి దంపతులు పెళ్లిపెద్దలుగా వ్యవహరించి, శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
కళ్యాణ కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత అన్నసమారాధన, తీర్థప్రసాదాలు, వడపప్పు, చలివిడి, పానకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version