Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshఆలయానికి కంబాల రూ. లక్ష విరాళం

ఆలయానికి కంబాల రూ. లక్ష విరాళం

కొంతమూరు మండలం రాజమండ్రి రూరల్ పరిధిలోని కోరుకొండ రోడ్, కొంతమూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ వారాహి దేవి పీఠం ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆజ్ఞా పీఠికతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జనవరి 26 నుంచి 28 వరకు శ్రీ సుదర్శన యజ్ఞం, హోమాలు, విశేష పూజలు జరగనుండగా, 28న ప్రత్యేక అభిషేకం, మహా మంగళహారతి నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖశాంతులు, ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆలయానికి లక్ష రూపాయల విరాళం అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవి అనుగ్రహం పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments