- తెలుగు మహా సభలకు
- హాజరుకానున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి
- జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ
- డా.గజల్ శ్రీనివాస్ , అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు.
ఢిల్లీ: (జయ జయహే): ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 2026 జనవరి 3,4,5 తేది లలో శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో జరుగనున్న 3 వ ప్రపంచ తెలుగు మహా సభలకు భారత సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ హాజరు కానున్నారని, వారిని ఢిల్లీ లో వారి గృహంలో కలసి ఆహ్వానించామని, 3 జనవరి 2026 తెలుగు మహా సభల ప్రారంభోత్సవానికి సతీ సమేతంగా హాజరు కానున్నట్లు తెలిపారని పరిషత్తు అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.
తెలుగు భాషను అజరామరం చేయడానికి అన్ని సంస్థలు కలసిపని చేయాలని, సంస్థా గతమైన వ్యవస్థను ఏర్పరచుకొని మాతృభాష తెలుగును ఉద్యమ స్ఫూర్తిగా రాబోయే తరాల వారికి అందించేటట్లు అందరూ పని చేయాలని జస్టిస్ శ్రీ నరసింహా అభిప్రాయ పడ్డారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.
