డుంబ్రిగుడ: (జయ జయహే న్యూస్): మండల కేంద్రంలోని సంతవలస గ్రామంలోని గుంట శీమా రోడ్డు కానుకొని ఉన్న ప్రభుత్వ భవనం ఉపయోగించకపోవడంతో ప్రస్తుతం ఆ భవనం నిరుపయోగంగా ఉంది. గతంలో సంత వలస ఎంపిపి పాఠశాలగా ఈ భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత పాఠశాలను ఎత్తివేయడంతో కొన్నేళ్లపాటు అంగన్వాడి కేంద్రంగా ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత అంగన్వాడి కేంద్రం కూడా అక్కడ నిర్వహణ కొనసాగించక పోవడంతో ప్రస్తుతం మరమ్మతుకు గురై శిధిలావస్థలో చేరుతుంది. సంత వలస గ్రామానికి సొంత అంగన్వాడి భవనం లేక ఓ నివాస గృహంలో నిర్వహణ కొనసాగిస్తున్నారు. దీంతో పలు ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామస్తులు అంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న ఈ ప్రభుత్వ భవనాన్ని మరమ్మత్తు పనులు చేసి అంగన్వాడి కేంద్రానికి అప్పగించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.
