Friday, April 17, 2026
HomePoliticsAndhra Pradeshకొవ్వూరులో జోరుగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

కొవ్వూరులో జోరుగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం కొవ్వూరు పట్టణంలోని గాయత్రి థియేటర్ సమీపంలో, స్టేట్ బ్యాంక్ ఎదుట నిర్వహించారు. ఈ కార్యక్రమం కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ టీవీ రామారావు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా పలు కొత్త సభ్యత్వాలు నమోదు చేయడంతో పాటు పాత సభ్యత్వాలను పునరుద్ధరించారు. కార్యక్రమానికి హాజరై సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొవ్వూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు కడదారి నవ్య, కోటే చందర్ రావు, కళ్ళే శ్రీను, కోటే హరీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments