జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం కొవ్వూరు పట్టణంలోని గాయత్రి థియేటర్ సమీపంలో, స్టేట్ బ్యాంక్ ఎదుట నిర్వహించారు. ఈ కార్యక్రమం కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ టీవీ రామారావు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా పలు కొత్త సభ్యత్వాలు నమోదు చేయడంతో పాటు పాత సభ్యత్వాలను పునరుద్ధరించారు. కార్యక్రమానికి హాజరై సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొవ్వూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు కడదారి నవ్య, కోటే చందర్ రావు, కళ్ళే శ్రీను, కోటే హరీష్ తదితరులు పాల్గొన్నారు.
