నిడదవోలు: డా॥ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంసీ చైర్మన్ గాలింకి జిన్నాబాబు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డా॥ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, సీనియర్ నాయకులు బైపే రాజేశ్వరరావు, ముప్పడి విజయసారథి, వరసాల రామకృష్ణ, ఎం.డి. షాజహాన్, బండి వేణుగోపాలకృష్ణ, గంగుమల్ల ప్రభావతి, శిలబోయిన వెంకటరమణ, గారపాటి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
