Home Uncategorized క్యాన్సర్ పేషెంట్ కి అండగా వాసుపల్లి గణేష్ కుమార్

క్యాన్సర్ పేషెంట్ కి అండగా వాసుపల్లి గణేష్ కుమార్

0

ప్రజా సేవే పరమావధిగా నిరంతరం సేవలందించే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన దాతృత్వం చాటుకున్నారు. *దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు కొబ్బరి తోటకు చెందిన చింతల సత్య కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం వార్డు నాయకుల ద్వారా తెలుసుకొని ఇంటికి వెళ్లి ఓదార్పునిచ్చారు. 34వ వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ తో కలిసి క్యాన్సర్ పేషెంట్ ను పరామర్శించి సొంత నిధులతో రూ.5000లు నగదు తో పాటు ఒక బియ్యం బస్తాను అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు*. దక్షిణ నియోజకవర్గంలో పేద ప్రజలను ఆదుకునే ఒకే ఒక్క నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ అని కొనియాడారు. నిస్వార్థ సేవలు అందిస్తూ నిత్యం పేదలకు ఆర్థిక సహాయంతో పాటు విద్యాదానం చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ సేవలు ప్రశంసనీయమని వార్డు నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నాయకత్వంలో తాము పని చేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version