Home News ఆశ్రమ పాఠశాలలు తనిఖీలు-ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి తిరుమణి శ్రీ పూజ

ఆశ్రమ పాఠశాలలు తనిఖీలు-ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి తిరుమణి శ్రీ పూజ

0

పాడేరు  : జయ జయహే
ఐటీడీఏ పాడేరు ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ హుకుంపేట మండలం సూకూరు గ్రామం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల లో విద్యార్థులకు వేడి చేసి సరఫరా చేస్తున్న త్రాగునీరు, వంటగది పరిశుభ్రతను, విద్యార్థులకు హెల్త్ ఐడి కార్డులు స్టాక్ రూము, జిసిసి సరఫరా చేయించిన సరుకులను పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులకు సామాన్య శాస్త్రంలో సామర్థ్యతను పరిశీలించారు. పరిసరాలను తరగతి గదులను వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. తనిఖీ సమయంలో ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో అందుబాటులో లేరు.
పాడేరు మండలం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల, గుత్తులపుట్టు లో సూపర్ 50 విద్యార్థుల యొక్క పరీక్ష జవాబు పత్రాలను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 4వ తరగతి విద్యార్థుల పుస్తక పఠనం సామర్ధ్యాలను పరిశీలించారు, వంటగది పరిశుభ్రతను, స్టాక్ రూము సరుకులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version