Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshవైజాగ్‌కు జగనన్న తెచ్చిన ఇనార్బిట్ మాల్

వైజాగ్‌కు జగనన్న తెచ్చిన ఇనార్బిట్ మాల్

మాల్‌కు 2023లో జగనన్న అనుమతులు
– షాపింగ్, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మాల్
– వైసీపీ జిల్లా అధ్యక్షులు కె.కె రాజు
విశాఖపట్నం మార్చి 24, జయ జయహే : విశాఖ ను గ్లోబల్ సిటీ గా చేయాలనే సంకల్పంతో అప్పటి సీఎం జగన్ ఇనర్భిట్ మాల్ తెచ్చారని అయితే అది తాము తెచ్చినట్టు చంద్రబాబు, లోకేష్ లు తెగ బిల్డప్ యిస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు కే కే రాజు ఆరోపించారు.
ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో ఇనార్బిట్ మాల్ రావడానికి ప్రధాన కారణం మాజీ సీఎం వై.యస్ జగన్మోహన్ రెడ్డని, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో మార్గదర్శమైన ఒక మార్గాన్ని సూచించడంలో ముందడుగు వేసి విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం
సాలగ్రామపురంలో 17 ఎకరాల భారీ విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి ఇనార్బిట్ మాల్ తీసుకురావడం జరిగిందన్నారు. ప్రారంభమైన ఇనార్బిట్ మాల్ ఒక పెట్టుబడి మాత్రమే కాకుండా విశాఖకు తలమానికంగా మారిందని అన్నారు. ఇనార్బిట్ మాల్ ద్వారా చిన్న తరహా పరిశ్రమలు, టూరిజం, వినోదాత్మకమైనటువంటి గేమ్ ఛేంజర్ గా మారిందని అన్నారు.ఈరోజు ప్రారంభమైన ఇనార్బిట్ మాల్.. క్రెడిట్ కోసం చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments