Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradesh23న భారత్ – న్యూజిలాండ్ టీ20 టికెట్స్ అమ్మకాలు

23న భారత్ – న్యూజిలాండ్ టీ20 టికెట్స్ అమ్మకాలు

28న మ్యాచ్ కు ఏర్పాట్ల పై అధికారుల సమీక్షఈనెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి డిస్టిక్ జొమాటో యాప్ లో భారత్ – న్యూజిలాండ్ టీ 20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల ప్రారంభం కానున్నాయి. జనవరి 28వ తేదీన విశాఖ వేదికగా జరగనున్న భారత్ – న్యూజిలాండ్ 4వ టి20 మ్యాచ్‌ను విజయవంతం చేయడానికి చేపడుతున్న ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం విశాఖపట్నం లోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈనెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి డిస్టిక్ జొమాటో యాప్ ద్వారా ఆన్లైన్ లో టికెట్ల అమ్మకాలు ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ అధికారులు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత బాగ్చి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం లో మ్యాచ్‌కు సంబంధించిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మైదానం నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కీలక అంశాలపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత బాగ్చి మాట్లాడుతూ ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టికెట్లకు నెంబరింగ్ సిస్టం ఏర్పాటు చేశామని , ఎవరికి కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలన్నారు. క్రికెట్ అభిమానులు ఆన్లైన్లో మాత్రమే టికెట్లు కొనుక్కోవాలని, టికెట్లు బయట ఎక్కడ అమ్మరని తెలిపారు. అలాగే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేకించి ప్రవేశ ద్వారాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
భద్రతను నిర్ధారించడానికి పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం అప్ గ్రేట్ చేయబడిన కేంద్రీకృత పబ్లిక్ అడ్రెస్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు క్రికెట్ జట్లు వారి బృందాల భద్రత కోసం ప్రత్యేకంగా పోలీస్ అధికారులను నియమించడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం జివిఎంసీ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు మాట్లాడుతూ ఈ మ్యాచ్ జీరో వెస్ట్ మేనేజ్మెంట్ తో మ్యాచ్ ను నిర్వహించడానికి ఏసీఏ తో కలిసి సన్నాహాలు చేస్తున్నామని పారిశుద్ధ సమస్యలు ఎక్కడ తలెత్తకుండా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నామని స్టేడియంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో త్రాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ టి 20 మ్యాచ్ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆర్డీవో సంగీత్ మాథూర్ ఆదేశించారు. విశాఖ నగరం ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని జట్లు ప్రయాణించే మార్గాల్లోనూ ఇతర ముఖ్య ప్రాంతాల్లోనూ సుందరీ కారణంగా పనులు వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశం లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కౌన్సిల‌ర్ దంతు విష్ణు తేజ్, ఏసీఏ సి.వో. వో, డి. సి. పి -1 సి. హెచ్. మణికంఠ లతో పాటు లా అండ్ ఆర్డ‌ర్, ట్రాఫిక్ పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎపిఈపిడిసిఎల్ విభాగం అధికారుల‌తో పాటు ఎసిఎ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments