భారీ గిరినాగు పట్టివేత
మాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీ పరిధిలో ధ్వారకానగర్ గ్రామంలో మాజీ సర్పంచి సీరా తలుపుల నాయుడు ఇంటి
ఆవరణంలో సోమవారం భారీ గిరినాగును పట్టుకున్నారు. ఇంటి సమీపంలో వంట కు ఉపయోగించడానికి నిల్వ చేసిన కర్రల గుట్టలో ఈ పాము చేరడం గమనించిన కుటుంబ సభ్యులు స్నేక్ క్యాచర్ వెంకటేష్కు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న వెంకటేష్ ఆ గిరి నాగును అవలీలగా చేతితో పట్టుకొని సంచిలో బందించారు. ఈ పాము సుమారు 13 అడుగుల పొడవు ఉందని తెలిపారు. బందించిన నాగును వంట్లమామిడి అడవుల్లో వదిలిపెట్టడం జరిగిందన్నారు. అభినందించారు.
