మహా శివరాత్రికి గట్టి బందోబస్తు – డ్రగ్స్‌పై కఠిన చర్యలు
జిల్లాలోని రంగంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్లను ఐజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌తో కలిసి మంగళవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లలో నమోదైన కేసులు, రికార్డులు, సిబ్బంది పనితీరు, మౌలిక సదుపాయాలను ఐజీ పరిశీలించారు. పోలీసింగ్ మరింత సమర్థవంతంగా ఉండాలని అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరి ఘాట్లు, పట్టిసీమతో పాటు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు.
డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేకంగా ఈగల్ టీంలను ఏర్పాటు చేశామని, గంజాయి అమ్మకాలు, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఐజీ హెచ్చరించారు. ఇటీవల కొత్తగా 400 మందిని రౌడీషీటర్లుగా గుర్తించామని, వారి కదలికలపై నిఘా పెంచి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదే సందర్భంగా స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు విద్య, భవ్య కిషోర్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రంగంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్లకు ఐజీ వార్షిక తనిఖీలు
RELATED ARTICLES
