విద్యార్థులకు నైతిక విలువలతో పాటు క్రమశిక్షణతో కూడిన చిత్తశుద్ధి ఎంతో అవసరమని విశ్రాంత ప్రిన్సిపాల్ పేడాడ రాంబాబు హితవు పలికారు. మంగళవారం కోటబొమ్మలి మండలం లఖదిద్ది ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పదవ తరగతి ఎంతో కీలకమైనదని ఇక్కడ పాసైన తీరని బట్టే మీ భవిష్యత్తు ను నిర్దేశించే ఇంటర్లో మీ ఎంటర్ తెలుస్తాది అన్నారు. కాబట్టి క్రమశిక్షణతో అంకితభావంతో విద్యను అభ్యసించాలని సూచించారు. రానున్న పరీక్షల్లో ఇష్టపడి పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని తద్వారా పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. నేటి యువత రేపటి దేశానికి మార్గదర్శకులని , రేపటి యువత మీరే కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరు ఉన్నత స్థానాలకు ఎదగాలంటే ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు.హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు పోలినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణపతి స్వామి, మాజీ డిసిసి అధ్యక్షుడు కర్రి అప్పారావు, విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రిన్సిపాల్ రాంబాబు ని హై స్కూల్ తరఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల సంస్కృతి కార్యక్రమంలో నిర్వహించారు.
