Home Politics Andhra Pradesh జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా క్రెడిట్, నాన్- క్రెడిట్ రుణాలు ఇచ్చేందుకు నిధులు సిద్ధం

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా క్రెడిట్, నాన్- క్రెడిట్ రుణాలు ఇచ్చేందుకు నిధులు సిద్ధం

0

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు కోన తాతారావు

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా క్రెడిట్, నాన్ – క్రెడిట్ రుణాలు విరివిగా అందజేసేందుకు నిధులు సిద్ధమని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు కోన తాతారావు తెలిపారు. సోమవారం మండలంలోని లక్ష్మీపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం దామునాపల్లిలో గల సహకార బ్యాంకుకు మంగళవారం ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా పిఎసిఎస్ అధ్యక్షుడు పాతాళం సంగమేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సభ్యులు రైతాంగంతో మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు పొందిన వారికి వాణిజ్య బ్యాంకుల కంటే తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలియజేశారు. హౌసింగ్ లోన్, ఆస్తి తనఖా రుణాలు, ఐదుగురు లేదా ఎక్కువగా గల జె. ఎల్.జి రైతు గ్రూపులు కు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు.సహకార సంఘ సభ్యులు రైతాంగం ఉద్యోగులు ఎవరికైనా సరే నిబంధనలను అనుసరించి రుణాలు అందించేందుకు సహకార బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పి.ఎ.సి.ఎస్.కు త్రాగునీటి బోరు, వాష్ రూమ్ ఫ్లోరింగ్ నిర్మాణం తదితర పనులకు సిడిఎఫ్, సిజిఎఫ్ నుండి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఎం.వి.వి కిషోర్, పాలకవర్గ సభ్యులు పండూరు సత్యనారాయణ, నీలం శంకర్రావు, లక్ష్మీపురం మాజీ సర్పంచ్ సిరిసిల్ల సత్యారావు దామునాపల్లి మాజీ సర్పంచ్ పాతాళం శ్రీను, విశాఖ డైరీ మాజీ చైర్మన్ పాతాళం సత్యారావు, ఎంపీటీసీలు వీరన్న, త్రిమూర్తులు, కడిమి అప్పారావు, బ్రాంచ్ మేనేజర్, సీఈవో సత్యనారాయణ, సంఘ సభ్యులు, రైతాంగం తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version