Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshబిర్యానీ, పులావ్ షాపుల మీద ఆహార భద్రతాధికారుల తనిఖీలు.

బిర్యానీ, పులావ్ షాపుల మీద ఆహార భద్రతాధికారుల తనిఖీలు.

నగరంలోని జీవీఎంసీ కార్యాలయం అవుట్ గేట్ కు ఎదురుగా ఉన్న 4 ఎఎం బిర్యానీ, కాకినాడవారి కోడి పులావ్, ఫుడీ మామ బిర్యానీ, స్పైసి బిర్యానీ పాయింట్స్ లో ఆహార భద్రతాధికారులు ఆకస్మిక తనిఖీ చేసి అక్కడి శ్యాంపిల్స్ ను సేకరించారు. ఆయా షాపుల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించామని విశాఖ నగర అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి తెలిపారు. అక్కడ పరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేయాలని ఆయా షాపుల యజమానులకు నోటీస్ లను జారీచేశామన్నారు. ఫుడ్ హ్యాండలర్స్ మాస్క్, కాప్, ఏప్రాన్ తదితరమైనవి ధరించాలని, వారికి ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ కరెక్ట్ గా ఉండాలని, ఫ్లోర్స్ అండ్ వాల్స్ సీలింగ్, గార్బేజ్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ, వేపుళ్లు, వాటికి వాడే నూనె తదితర 14 రకాల శ్యాంపిల్స్ సేకరించి వాటి అనాలిసిస్ నిమిత్తం ఫుడ్ ల్యాబ్ కి పంపామన్నారు. వాటి రిపోర్ట్ ల ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఎఐ యాక్ట్ ప్రకారం సంబంధిత వ్యాపారులపై తగిన చర్యలు తీసుకుంటా మన్నారు. ఈ తనిఖీల్లో ఆహార భద్రతాధికారులు జి.వి.అప్పారావు, సతీష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments