Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshసంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించేందుకే సమ్మేళనాలు

సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించేందుకే సమ్మేళనాలు

జన చైతన్య సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
రాష్ట్రాల మధ్య సంస్కృతి సంప్రదాయాలు విలువల పరస్పర మార్పిడిని ప్రోత్సహించేందుకు అంతర్రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు మై భారత్ గుంటూరు జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి అన్నారు.కేంద్ర యువజన వ్యవహారాలు,క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో,మై భారత్ కేంద్రం గుంటూరు నిర్వహిస్తున్న అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనం రెండో దశ కార్యక్రమంలో క్షేత్ర దర్శనలో భాగంగా ఆదివారం ఉండవల్లి గుహలు, అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయాన్ని,ధ్యాన బుద్ధ, మ్యూజియాన్ని త్రిపుర రాష్ట్రం నుండి 37 మంది యువతి-యువకులు సందర్శించారు.ఈ కార్యక్రమం లో భాగంగా అమరావతిలోని జనచైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సమాజ సేవా కార్యక్రమాల గురించి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి బెన్నిబాబు ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనచైతన్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనచైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గుంటూరు జిల్లా మై భారత్ ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి ని ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో కోలాటం మాస్టారు తుళ్ళూరి సాంబశివరావు ఆధ్వర్యంలో అమరావతి మండలంలోని పొందుగల గ్రామ మురళి కృష్ణ కోలాట బృందం కోలాట ప్రదర్శన ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ఆఫీసర్ జయరావు,జన చైతన్య సమితి కోఆర్డినేటర్ వెలితోటి అనిల్ కుమార్, బెజ్జం నాగేశ్వరరావు,రాణి,త్రివేణి, తదితరులు పాల్గొన్నారు. కోలాటం ప్రదర్శించిన బృందానికి ఈసందర్భంగా ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments