ఉగాది వేడుకల్లో ఆచార్య మలయవాసిని
శ్రీ సత్య సాయి బాబా వారి ఉత్తమ సంస్కారమైన బోధనను పాటిస్తే సమాజం శాంతియుతంగా , ఆనందమయంగా ఉంటుందని విశ్రాంత తెలుగు ఆచార్యులు కోలవెన్ను మలయవాసిని అన్నారు. శ్రీ సత్యసాయి విద్యా విహార్ ప్రాంగణం ప్రేమ సదన్‌లో గురువారం జరిగిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది” పర్వదిన మహోత్సవములు సందర్భంగా శ్రీ సత్యసాయి త్రిభువన విజయం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటమే ప్రధాన ఆశయంగా భావించి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు ప్రతి సంవత్సరమూ త్రిభువన విజయమనే సాంస్కృతిక , సాహిత్య కాయక్రమాలను నిర్వహించి ప్రజలలో చైతన్యాన్ని , సంస్కారాన్ని కలిగించేవారన్నారు. అందరినీ ప్రేమించు- అందరినీ సేవించు అన్న భగవాన్ సాయి బాబా ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వి. బాలమోహన్ దాస్, ఆచార్య ఎం ఎస్ ప్రకాశం రావు తదితరులు మాట్లాడుతూ సత్యసాయి మాటలను గుర్తు చేసుకున్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు పిన్నింటి రామ సుందర నారాయణ నాయుడు స్వాగతోపన్యాసంలో కవి సమ్మేళనానికి విచ్చేసిన పెద్దలందరికీ ధŠన్యవాదములు తెలిపారు. ప్రపచనకర్త, విశ్రాంత ఆచార్యులు కోలవెన్ను విట్టల్ మూర్తి, డాక్టర్ మీగడ రామలింగస్వామి, డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ, డాక్టర్ రాంభట్ల నృసింహ శర్మ, డాక్టర్ దామెర వెంకట సూర్యారావు, డాక్టర్ ఉపద్రష్ట సర్వమంగళ శాస్త్రి, డాక్టర్ కందాళ కనకమహాలక్ష్మి, డాక్టర్ వెంపటి రామనరసింహం, డాక్టర్ దుగ్గిరాల రాజ్ కిషోర్ , డాక్టర్ గండికోట రఘు రామారావు, ఎస్. వినయ భూషణ రావు, డాక్టర్ వాడ్రేవు సూర్యప్రభ, మతిమండా రామలక్ష్మ్మి, దామరాజు విశాలాక్షి, డాక్టర్ కొచ్చెర్లకోట వెంకట సత్యన్నారాయణ మూర్తి, శేఖరమంత్రి ప్రభాకర్ , మొసలికంటి మల్లిక, చిల్లా చిన సూర్యనారాయణ, ఉండవల్లి సుజాత మూర్తి, డాక్టరెY సూర్య లక్ష్మి, వంటి ప్రముఖ రచయితలు, కవులు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థల జిల్లా జాయింట్ స్పిరిట్యుయల్ కోఆర్డినేటర్ బి వి రమణ సమన్వయపరిచారు . ఈ కార్యక్రమంలో సిటీ సమితి కన్వీనర్ సాయికుమార్, కన్వీనర్, సేవా సంస్థల రాష్ట్ర, జిల్లా పదాధికారులు శ్రీ సత్య సాయి మహిళా సభ్యులు, బాలవికాస్ సభ్యులు, శ్రీ సత్య సాయి యువత, పురజనులు భక్తితో, ఆనందంతో పాల్గొన్నారు.
