Monday, May 25, 2026
HomeEditorialsవెల్ బేబీ షోలో చిన్నారి జైన్ అష్రఫ్ కి మొదటి బహుమతి

వెల్ బేబీ షోలో చిన్నారి జైన్ అష్రఫ్ కి మొదటి బహుమతి

హైదరాబాదులో 85వ అల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో జరిగిన వెల్ బేబీ షోలో కర్నూలుకు చెందిన చిన్నారి సయ్యద్ జైన్ అష్రఫ్ మొదటి బహుమతి సాధించి విశేషంగా ఆకట్టుకున్నాడు. కర్నూలు, అనంతపురం జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా పని చేసిన ఖాజా మొహిద్దిన్ కుమారుడు డాక్టర్.జావేద్ అష్రాఫ్, డాక్టర్. షాహిరా దంపతుల కుమారుడు సయ్యద్ జైన్ అష్రాఫ్ వెల్ బేబీ షోలో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాదు నగరంలోని నాంపల్లి లో 85వ అల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్- 2026 లో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా యశోద హాస్పిటల్, ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన వెల్ బేబీ షోలో 15 నెలల సయ్యద్ జైన్ అష్రఫ్ మొదటి బహుమతి గెలుచుకున్నాడు. ఇక్కడే గత ఏడాది జరిగిన 100 రోజుల పిల్లలకు నిర్వహించిన వెల్ బేబీ షో లో కూడా జైన్ అష్రఫ్ మొదటి బహుమతి గెలుచుకోవడం జరిగింది. మొదటి బహుమతి సాధించడం పట్ల అష్రాఫ్ తాత ఖాజా మొహిద్దిన్, తల్లిదండ్రులు డాక్టర్.జావేద్ అష్రాఫ్, డాక్టర్. షహిరా, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments