Wednesday, February 11, 2026
HomePoliticsAndhra Pradeshహామీలు అమలు చేయలేక వైసీపీ మీద తప్పుడు ప్రచారం

హామీలు అమలు చేయలేక వైసీపీ మీద తప్పుడు ప్రచారం

తప్పుడు ప్రచారంతో వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు..*

*చంద్రబాబు, పవన్ వెంకన్న భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి..*

*వై.యస్.ఆర్.సి.పి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె.కె రాజు గారు.. తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మరియు కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన చార్జీషీట్‌లో స్పష్టం చేయడం జరిగింది. కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టు జాతీయ అధ్యక్షులు వై.యస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వార్డు వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు వెంటేశ్వర స్వామి – కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.

ఈ సందర్బంగా మీడియాతో కె.కె రాజు మాట్లాడుతూ..ఈరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏ విధంగా వైసీపీ పైన తప్పుడు ప్రచారాలుతో మరియు అబద్ధపు హామీలతో ప్రజల ఆశాభావాన్ని ఆసరాగా చేసుకుని అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇచ్చిన హామీల అమలు చేయలేక ఈరోజు ఈ రాష్ట్రంలో అసమర్ధ పాలన చేస్తూ కప్పిపుచ్చుకోవడానికి వైసిపి పైన వైసిపి నాయకులు పైన అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు.
అందులో భాగంగానే ప్రపంచంలో ఉన్న కోట్లాదిమంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డుపై లేనిపోని విష ప్రచారాలు చేస్తున్నారు…
పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకు వేసి సినిమా యాక్టర్ అవతారం తీసేసి కొత్త అవతారం ఎత్తి కింద నుంచి పైకి మెట్లు కడిగి కొత్త యాక్టింగ్ మొదలుపెట్టాడు అని మండి పడ్డారు..
వైసిపి పార్టీ పైన , వైసీపీ నాయకులు మీద ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఈ రోజు సిట్ నివేదికలో తిరుమల లడ్డు ప్రసాదంలో ఎటువంటి కొవ్వు కలవలేదు అని నిర్ధారణ అయింది అని అన్నారు..
తిరుమల లడ్డుపై ఇటువంటి దుష్ప్రచారాలు చేసి కోట్లాదిమంది స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసిన వారిని ఆదేవుడు, ప్రజలే తగిన బుద్ది చెబుతారు అని అన్నారు..
వైసీపీ పైన మా నాయకుడి పైన ఎవరు ఎటువంటి దుష్ప్రచారాలు చేసిన ఆదేవుడు పై మా నాయకుడు నిబద్ధత ఏమిటో, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments