Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించాలి

ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించాలి

డాక్టర్ కందుల నాగరాజు

ప్రతి ఒక్కరు మానవత్వంతో స్పందించి, సాటి వారికి సహాయం చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.
32 వ వార్డు ప్రాంతంలో నవ వధువు అనూషకు బంగారు తాళిబొట్టు, పట్టుచీర, పసుపు కుంకుమలను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాల నుంచి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
వార్డు పరిధిలోనే కాకుండా నియోజకవర్గ పరిధిలో కూడా ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా తాను ముందు ఉంటూ వారికి తన పరిధి మేరకు సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు.
నిరుపేద విద్యార్థులకు, వృద్ధులకు, వికలాంగులకు,
వితంతువులకు, గర్భిణీ స్త్రీలకు తన వంతు సహాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా తన సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాలివాహన,
యాదగిరి శ్రీను, సిపిఐ బుజ్జి ,అప్పారావు , శ్రీదేవి, కోదండమ్మా , జానకీ, సీత,ఉమా, హేమ,కుమారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments