బిజెపి మండల అధ్యక్షుడు శివకుమార్.
ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా దేశ ప్రజలు ఇబ్బందులు పడకుండా సమర్థవంతమైన పాలన నందించడం భారత ప్రధాని నరేంద్ర మోదీకే సాధ్యమవుతుందని బిజెపి కొయ్యూరు మండల అధ్యక్షుడు సంపరి శివకుమార్, పాడేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మచ్చల మంగతల్లి, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి గౌరీ పార్వతి పేర్కొన్నారు. మండలంలోని బాలారం గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్ అధ్యక్షతన మండల పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విపత్కర సమయాల్లో సైతం దేశ ఆర్థిక అభివృద్ధికి ఇబ్బందులు కలగకుండా ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. పశ్చిమ ఆసియా ఖండంలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రపంచం వణుకుతున్నప్పటికీ భారత్ మాత్రం ధైర్యంగా ముందుకు సాగుతోందన్నారు. శాంతి చర్చల ద్వారా యుద్ధాన్ని ఆపడం ప్రపంచ దేశాలకు శ్రేయస్కరమని ఇరుదేశాల అధినేతలతో మోడీ మాట్లాడుతున్నారన్నారు. అనేక దేశాల్లో ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్న భారతదేశంలో అటువంటి పరిస్థితులు రాకుండా కఠిన నిర్ణయాలు చర్యలు చేపడుతున్నారని ఇది బిజెపి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని, గ్రామస్థాయి నుండే పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా శ్రేయస్సుకు రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని పాడేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మంగతల్లి పేర్కొన్నారు. ఇటీవల యాదవ సంఘం అల్లూరి జిల్లా అధ్యక్షునిగా నియమితులైన బిజెపి కొయ్యూరు మండలం మాజీ అధ్యక్షుడు మురుకుర్తి అప్పలరాజు దంపతులను, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమితులైన గౌరీ పార్వతిని నేతలు సాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సన్యాసిరావు, మహిళా నేత భవాని, పదాధికారులు మల్లేష్, చిన్ని రాజు ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్ పాల్గొన్నారు.
