పాడేరు,జయజయహే జన్ జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా గొప్ప గిరిజన వీరుడు , స్వాతంత్ర్య సమరయోధుడు ధర్తీ ఆభా భగవాన్ బిర్సా ముండా 150వ జయంత్తోత్స వాలు నవంబర్ ఒకటి నుండి పదిహేను వరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మూడు ఐటిడిఏ పరిధిలో ఘనంగా జరుపుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ తెలిపారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనుల సేవలను, త్యాగాలను గౌరవించడం ఈ జయంత్తోత్సవాల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఐటిడిఏ పాడేరు నుండి కాఫీ హౌస్ వరకు కార్నివాల్ ను ప్రారంభించారు. పండగ వాతావరణంలో జరిగిన ఈ కార్నివాల్ లో గిరిజన సంస్కృతి , సాంప్రదాయాలను ప్రతిబింబించే విధముగా ధింసాలు, కోలాటాలు గిరిజన కళాకారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకొన్నాయి. అనంతరం ఐటిడిఏ కాఫీ హౌస్ నందు ధర్తీ ఆభా భగవాన్ బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి , బిర్సాముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ప్రారంభించారు. ఈ కార్యక్రమములో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యo కోసం అలుపెరగని పోరాటం చేసిన గిరిజన ముద్దు బిడ్డ బిర్సా ముండా అని కొనియాడారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధులు , గిరిజన సాంఘీక సమస్యలపై పోరాడిన సంఘసంస్కర్తల యొక్క విజయాలు , విజయగాధలు కనుమరుగు అవకుండా గిరిజన సమాజ అభివృద్ధికి , ఆ జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. దేశములోనే మొట్టమొదటగా మన రాష్ట్రంలో ఐటిడిఏ అనే విధానమును తీసుకువచ్చి ప్రభుత్వం గిరిజనులు అభివృద్దికి, వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తుందన్నారు. మన గిరిజన అభివృద్ధి విధానాలను, పధకాలను, సేంద్రియ వ్యవసాయ పద్దతులను దేశములో ఉన్న పక్క రాష్ట్రాలు అవలంబిస్తున్నాయన్నారు. ఇక్కడ ఉన్న గిరిజన సాంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను, కాపాడుకోవాల్సిన భాద్యత ప్రజా ప్రతినిధులు , అధికారులు , ప్రజలగా మనపై ఉందన్నారు. గిరిజనల అభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రత్యేక సంక్షేమ పధకాలు పీయం జన్ మన్, పీయం జుగా లాంటివి చేపడుతుందని ఆరోగ్యం , విద్య , వ్యవసాయం , రోడ్లు , విద్యుత్ , మంచి త్రాగునీరు , పౌష్టికాహారం , మొబైల్ కనెక్టివిటీ , ఇంటర్నెట్ , గృహాల నిర్మాణం కొరకు వేల కోట్లు ఖర్చు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ప్రాంత ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ , ఐ టి డి ఏ పి వో తిరుమణి శ్రీ పూజ , ట్రైకార్ చైర్మన్ కె. కృష్ణ రావు , కాఫీ బోర్డు చైర్మన్ బొర్రా నాగరాజు , పీయమ్ యూ నాగరాజు, పాడేరు ఐ టి డి ఏ ఏ పి వో వెంకటేశ్వర్లు , పాడేరు ఐ టి డి ఏ పరిపాలన అధికారిణి హేమలత పలు శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
