Saturday, April 18, 2026
HomeUncategorizedశ్రీ సింహాద్రి నాధ శాశ్వత నిత్యఅన్నప్రసాద నిధికి విరాళం

శ్రీ సింహాద్రి నాధ శాశ్వత నిత్యఅన్నప్రసాద నిధికి విరాళం

సింహాచలం, జయ జయహే:
శ్రీ సింహాద్రి నాధ స్వామివారి కృపతో భక్తి పూర్వకంగా సేవలో నిమగ్నమైన భక్తులు, నిత్యాన్నదానం వంటి మహా పుణ్యకార్యాలలో భాగస్వాములవుతున్నారు. ఈ క్రమంలో, విశాఖపట్నం నగరంలోని సింహాచలం రాజీవ్ కాలనీకి చెందిన శ్రీ లంకా జయ మౌర్య సాయి గారు, ₹1,00,116/-ను శ్రీ సింహాద్రి నాధ శాశ్వత నిత్యఅన్నప్రసాద పథకం నిధికి ఉదారంగా విరాళంగా సమర్పించారు.
దాత లంకా జయ మౌర్య సాయి స్వయంగా దేవస్థానం ప్రోటోకాల్ ఆఫీస్ నందు ఉన్న విరాళ కౌంటర్లో నగదు చెల్లించి, తగిన రసీదును పొందారు. అనంతరం, ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి సునీల్ కుమార్ , దేవస్థానం తరఫున శ్రీ సింహాద్రి నాధ శాశ్వత నిత్యఅన్నప్రసాద పథకం బాండ్‌ను భక్తునికి అందజేశారు.
దాత కు దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసారు. అనంతరం దేవస్థానం తరఫున స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రసాదాలను భక్తునికి అందజేశారు.
దేవస్థానం తరఫున దాత లంకా జయ మౌర్య సాయి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, వారి దాతృత్వం స్వామివారి సేవలో ఒక ప్రేరణాత్మక ఆదర్శంగా నిలిచిందని అభినందించబడింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments