పాటలతో అలరించిన సునీత పాటలు అరకు లోయలో జరిగిన ‘అరకు ఫెస్ట్’ సంగీత విభావరి అట్టహాసంగా సాగింది. ప్రముఖ గాయని సునీత తన బృందంతో కలిసి ప్రదర్శించిన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
ఈ వేడుకకు సంబంధించిన
అరకు ఫెస్ట్ విశేషాలు
సమిష్టి సహకారం, స్థానిక యంత్రాంగం, పర్యాటక శాఖ మరియు ప్రజల సమిష్టి కృషితో ఈ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
సునీత సంగీత విభావరి తన మధురమైన గొంతుతో మెలోడీ పాటలు మరియు హుషారైన నంబర్లతో సునీత పర్యాటకులను, స్థానికులను మరియు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
సాంస్కృతిక కార్యక్రమలు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో పాటు, ఆధునిక సినీ సంగీతం తోడవ్వడంతో అరకు లోయ పర్యాటక శోభను సంతరించుకుంది.
పర్యాటక ఊతముకు ఇటువంటి కార్యక్రమాల వల్ల అరకు పర్యాటక రంగానికి మరింత గుర్తింపు లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
”అరకు అందాలకు సునీత గొంతు తోడవడంతో ఆ సాయంత్రం వేల మధుర జ్ఞాపకంలా మిగిలిపోయింది. వేడుకకు హాజరైన ఒక పర్యాటకులు ఆనందం వేక్తం చేశారు. మొట్ట మొదటిగా నగరబేరి, కైభేరి రాజస్థాన్ ట్రూప్, గోండు ట్రైబల్ డాన్స్ తెలంగాణా, ఆదివాసీ డాన్స్ ఛత్తీస్గఢ్ ప్రదర్శనలు అక్కటుకునాయి.
ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్, ఇంచార్జి జాయింట్ కలెక్టర్ , ఐటిడిఏ పి ఓ తీరుమణి శ్రీ పూజ, జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, సహాయ కలెక్టర్ కె సాహిత, ఎపి ఎస్ అర్ టి సి చైర్మన్ దొన్ను దొర, మాజీ శాసన సభ్యురాలు గిడ్డిశ్వరి, పాడేరు డిఎస్పీ కే అభిషేక్ అధికారులు జిల్లా యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు.
