Home Politics Andhra Pradesh సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే…!

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే…!

0

ఏపీ ఎన్‌జీజీవో నేతలకు సన్మానం

సీపీఎస్‌ రద్దు చేయాలని ఏపీ ఎన్‌జీజీవోస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుదవారం కేజీహెచ్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌ హాల్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కానీ ఆ వైపు అడుగులు వేయడం లేదని అందుకు ఉద్యోగులంతా కలసికట్టుగా ప్రయత్నిస్తే ప్రభుత్వం ఉద్యోగుల కోర్కెలు తీర్చేందుకు సిద్దమవుతుంసదన్నారు. ప్రభుత్వ నర్సుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గంగా భవానీ, వరలక్ష్మిల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్‌జీజీవోస్‌ జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి శంకర్‌; ఆంధ్రప్రదేశ్‌ కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(ఏపీసీపీఎస్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్షులు సతీష్‌ కుమార్‌ తదితరులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అనంతరం ఏపీసీపీఎస్‌ఈఏ కేజీహెచ్‌ ఎన్నికలు నిర్వహించారు. నర్సింగ్‌ గ్రేడ్‌1 సూపరింటెండెంట్‌ సీహెచ్‌ పద్మావతిని అధ్యక్షురాలిగా, మరో 20 మందిని కార్యవర్గ సభ్యులిగా ఎన్నుకున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version