ప్రధాన రహదారులకు ఇరువైపులా పేరుకుపోయిన ఇసుకను తక్షణం తొలగించి ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులకు రక్షణ కల్పించాలని సీపీఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులు ఎం. సుందర్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కొవ్వూరు రెవిన్యూ డివిజన్ ఆర్వో అచ్యుతకుమారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సుందర్ బాబు మాట్లాడుతూ గోదావరి నుంచి ఇసుక తరలిస్తున్న అధిక లోడుతో కూడిన వాహనాల కారణంగా రోడ్లపై ఇసుక జారిపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారుల వెంబడి రెండు అడుగుల నుంచి నాలుగు అడుగుల వరకు ఇసుక, మట్టిపొర పేరుకుపోయి ప్రమాదాలకు దారితీస్తోందన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఇసుకపై జారి పడే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
ఇసుక రవాణా చేసే వాహనాల్లో అధిక లోడును నియంత్రించాలని, బరకాలతో కప్పి సరఫరా చేయాలని, అతివేగాన్ని అదుపులో పెట్టాలని అధికారులను కోరారు. అలాగే ఇప్పటికే పేరుకుపోయిన ఇసుకను తక్షణం తొలగించి రహదారులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ముందు సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధాన రహదారులపై ఇసుక తొలగించాలి: సిపిఐఎం వినతి
RELATED ARTICLES
