Sunday, April 26, 2026
HomeSportsహ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ తో కార్పొరేటర్ ఉష శ్రీ

హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ తో కార్పొరేటర్ ఉష శ్రీ

బ్యాడ్మింటన్ పోటీల్లో మూడు ‘గోల్డ్’ మెడల్స్  క్రీడల్లో తమ సత్తా చాటుతున్న ఉషశ్రీ  ​జిల్లా స్థాయి మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు కైవసం గాజువాకలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026 పోటీల్లో జీవీఎంసీ 43వ వార్డు కార్పొరేటర్ పెద్దింటి ఉష శ్రీ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ టోర్నమెంట్‌లో ఆమె ఏకంగా మూడు విభాగాల్లో బంగారు పతకాలను సాధించి క్లీన్ స్వీప్ చేశారు. 45 ఏళ్ల పైబడిన (45+) విభాగంలో జరిగిన పోటీల్లో ఉషశ్రీ తన ప్రతిభతో ప్రత్యర్థులను చిత్తు చేశారు. అద్భుత పోరాట పటిమ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సమన్వయంతో ఆడి స్వర్ణ పతకాన్ని సాధించారు.
​ఈ విభాగంలోనూ విజేతగా నిలిచి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్‌తో జిల్లా ఛాంపియన్‌గా నిలిచారు.
​ఒకే టోర్నీలో మూడు విభాగాల్లో విజేతగా నిలిచిన కార్పొరేటర్ ఉషాశ్రీని తోటి కార్పొరేటర్లు, క్రీడాకారులు, అభిమానులు పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. ఈ విజయం పట్ల ఆమె స్పందిస్తూ.. నిరంతర సాధన, క్రీడల పట్ల ఉన్న మక్కువతోనే ఈ విజయం సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments