Monday, June 1, 2026
HomePoliticsAndhra Pradeshవ్యవసాయ మంత్రి దృష్టికి సహకారం సమస్యలు

వ్యవసాయ మంత్రి దృష్టికి సహకారం సమస్యలు

రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఉద్యానవన శాఖా మంత్రి కింజరపు అచ్చం నాయుడునీ శుక్రవారం అమరావతిలో మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి తో మాడుగుల మండల తెలుగుదేశం నాయకులు, పలువురు సహకార ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కోపరేటివ్ సొసైటీలు అభివృద్ధి పథంలో నడపడం కోసం, సొసైటీ లో పనిచేస్తున్న సిబ్బందికి సదుపాయాలు కల్పించడం, అలాగే సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ నియామకం గురించి విన్నవించడం జరిగిందన్నారు. అలాగే కింతలి సొసైటీ భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెంపరే సొసైటీ అధ్యక్షుడు ఉండూరు దేవుడు,అనకాపల్లి జిల్లా కోపరేటివ్ సొసైటీ యూనియన్ అధ్యక్షులు బొడ్డేటి లక్ష్మణరావు, వీరనారాయణ సొసైటీ సీఈవో తూరుబిల్లి సత్యనారాయణ, కింతలి సొసైటీ సీఈవో పోతురమేషు, అకౌంటెంట్ పోతినేటి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మంత్రితో మాట్లాడుతూ సహకార ఉద్యోగుల జీతభత్యాల నిమిత్తము ఇచ్చిన జీవో నెంబర్ 36 వెంటనే అమలు చేయాలని, సహకార ఉద్యోగుల గ్రాడ్యుటీ ప్రస్తుతం ఉన్న లక్ష రూపాయలను ఐదు లక్షల వరకు పెంచాలని, 20 లక్షల వరకు ఉద్యోగులకు టర్మిన్సూరెన్స్ చేయాలని కోరారు. అలాగే 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను పర్మనెంట్ చేయలని, ఉద్యోగులపదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రిని ఎమ్మెల్యేను సహకార సిబ్బంది సత్కరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments