గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రజల సహకారం ఎంత అవసరమని ఎండిఓ కే అప్పారావు చెప్పారు. శుక్రవారం మాడుగుల మండలం కేజేపురం గ్రామంలో వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పంచాయతీ అభివృద్ధి చెందాలంటే ఆదాయం ఎంత అవసరమని ఇందుకు ఇంటి పన్నులు ప్రతి ఒక్కరు చెల్లించాలని కోరారు. తద్వారా సిబ్బంది జీతభత్యాలు, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. ఇందుకుగాను ప్రజలు సహకారం అందించాలని కోరారు.అలాగే పింఛన్ ల పంపిణీ లోనూ, తడి చెత్త- పొడి చెత్త వేరు చేయడoలోనూ అనుసరించాల్సిన విధానాలను కూడా అయన వివరించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇంటి పన్నుల వసూలు కొరకూ పంచాయతీ అభివృద్ధి అధికారులు, వివో ఏ లు అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు , క్లస్టర్ ఇంచార్జి బి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
