Monday, June 1, 2026
HomePoliticsAndhra Pradeshచోడవరం ప్రారంభమైన మహా శివరాత్రి ఉత్సవాలు

చోడవరం ప్రారంభమైన మహా శివరాత్రి ఉత్సవాలు

స్థానిక స్వయంభు గౌరీశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహా శివరాత్రి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యయీ. ఉదయం 6 గంటలకు లోకకళ్యాణార్థం ఉత్సవ కమిటీ విగ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం సంప్రోక్షణ పూజలు ఉత్సవ కమిటీ చైర్మన్ గూడూరు సురేష్ దంపతులు నిర్వహించారు. అలాగే మహాన్యాస పూర్వక పంచామృత అభిషేక పూజలను రుద్రహోమ పూజలు జరిగాయి. గౌరీశ్వర స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే సాయంత్రం జంగమ సేవా సంఘం ఆధ్వర్యంలో తిరువీధి ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది.అలాగే సాయంత్రం మహిళలలు చే గౌరీ పార్వతీ దేవికి లక్ష కుంకుమార్చన పూజలు ప్రత్యేక దీపారాధనలు కూడా చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి చలపతి, శ్రీనివాస్, మహేష్ తదితరులు అంకురార్పణ ద్వజారోహణ పూజలను అత్యంత భక్తీశ్రద్ధలతో వేదమంత్రోత్సవాల నడుమ నిర్వహించారు. దీంతో కళ్యాణ మహాశివరాత్రి ఉత్సవాలుకి తెర తీశారు. ఈనెల 18 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా నెల 15 న మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments