Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshఉబ్బెంగులకు నూతన రహదారి నిర్మాణం పనులు పూర్తి

ఉబ్బెంగులకు నూతన రహదారి నిర్మాణం పనులు పూర్తి

హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ త్రినాథ్, గ్రామస్తులు

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం మారుమూల లక్ష్మీపురం పంచాయితీ ఉబ్బెంగుల గ్రామానికి పక్కా రహదారి నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. దీంతో సర్పంచ్ కె త్రినాధ్ తో పాటు ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పనులు పూర్తయిన నూతన రహదారిని సోమవారం సర్పంచ్ కొర్రా త్రినాథ్, స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బుంగాపుట్టు పిఆర్ రోడ్డు నుండి ఉబ్బెంగుల వరకు రెండు కిలో మీటర్లు రోడ్డు నిర్మాణం కు పీఎం జన్ మన్ పథకం కింద రూ. కోటి 94 లక్షలు మంజూరు అయిందని తెలిపారు. ఆ నిధులు వెచ్చించి నూతన రహదారి నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో ఆ ప్రాంతీయులకు రవాణా కష్టాలు గట్టెక్కాయని, దీంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రోడ్డు నిర్మాణం కోసం సహకరించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు,అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వారు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వి.సాధురాం,వార్డు సభ్యులు వి.గురుమూర్తి,వి.సుబ్బారావు,పిసా సభ్యులు వి.సుబ్బారావు, వి.నీలకంఠం,గ్రామస్థులు వి.మెట్ట,రంపాన,సోమనాథ్,సద్దు,తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments