Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshపేద విద్యార్థుల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం

పేద విద్యార్థుల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం

వైస్సార్సీపీ ఎంబీసి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పెండ్ర వీరన్న*

విల వైస్సార్సీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, వైసిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్,మరియు ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న పత్రిక సమావేశం లో మాట్లాడుతు
పేదవాడి ఏకైక ఆయుధం విద్యేనని “ఈ దేశంలో పేదరికం అనే సంకెళ్లను తెంచుకోవడానికి పేదవాడి దగ్గర ఉన్న ఏకైక ఆయుధం చదువు. ఆ ఆశతోనే రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల పిల్లలు, తమ జీవితాలు మారతాయని ఆశగా కాలేజీల గడప తొక్కారన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల ఆ విద్యావంతుల భవిష్యత్తు చీకటమయం అవుతుందని. విద్యార్థుల కలలు కలలూగానే మిగిలిపోతున్నాయని ఆయన అన్నారు,
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకపోవడం వల్ల విద్యార్థులు అగచాట్లుపడుతున్నారు అని, *ఫీజు బకాయిలు ఉన్నాయనే సాకుతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని,కష్టపడి చదివిన విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆయన* ఆవేదన వ్యక్తపరిచారు,
కోర్సు పూర్తయిన. వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీలు నిలిపివేస్తున్నాయి. దీనివల్ల పైచదువులకు వెళ్లలేక, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక యువత రోడ్డున పడుతున్నారని పెండ్ర వీరన్న అన్నారు,
ప్రభుత్వ సాయం వస్తుందని నమ్మి పిల్లలను చేర్పిస్తే, ఇప్పుడు యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక పేద తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఫీజులు కడుతున్నారని అన్నారు,
ఒక పేదవాడి బిడ్డ చదువుకోవాలంటే ఈ సమాజంలో, ఈ కూటమి ప్రభుత్వ హయాంలో ఇంతటి అవమానాన్ని ఎదుర్కోవాలా? చదువుకోవడం నేరమా అని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు?”
ఈనెల 11వ తేదీ నుండి శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయని ఆ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు ఈ విషయంపై గందరగోళం చేస్తారన్న ఉద్దేశంతో, హఠాత్తుగా ఈనెల 10వ తేదీనే 1200 కోట్ల రూపాయలకు సంబంధించిననాలుగు జీవోలను విడుదల చేసి తదుపరి ఈరోజు వరకు ఆ జీవోలు అమరుకు నోచుకోలేదన్నారు.
ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు అస్సలు పొంతన లేదన్నారు.
జీవో ఇచ్చి చేతులు దులుపు కోవడమే మీ పనా అని అడుగుతున్నామన్నారు. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 1200 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేస్తూ జీవో ఇచ్చి వారం రోజులు దాటినా, ఆ నిధులు విద్యార్థుల ఖాతాల్లో ఎందుకు జమ కాలేదని వీరన్న ప్రశ్నించారు.
బడ్జెట్‌లో విద్య కోసం కేటాయించిన నిధులు ఏమయ్యాయి? కేటాయింపులు కేవలం కాగితాలకే పరిమితమా?
విడుదలలో జాప్యం ఎందుకు జరుగుతుందన్నారు మీ పత్రికలో నిధులు విడుదలయ్యాయని గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ, అవి లబ్ధిదారులకు ఎందుకు జమ కాలేదన్న విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు.

వేల సంఖ్యలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం కూటమి ప్రభుత్వానికి తగదని ఆయన ఎద్దేవా చేశారు,, ఒకవేళ కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఫీజుల చెల్లింపు విషం పై ఇదేవిధంగా వైఖరిని కొనసాగిస్తే మా *అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధమవుతావని ఆయన హెచ్చరించారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments