Sunday, May 3, 2026
HomePoliticsAndhra Pradeshబీసీ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన కూటమి ప్రభుత్వం

బీసీ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన కూటమి ప్రభుత్వం

సనపల రవీంద్ర భరత్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో వెనుకబడిన తరగతుల (బీసీ) కులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్యం, రాజకీయ దాడులు, కుతంత్రాలు మరియు సంక్షేమ చర్యలకు సంబంధించిన విషయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం విశాఖ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బీసీ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు, బీసీ పరిరక్షణ చట్టం కోసం ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదనే తప్పా ఆచరణలో అలసత్వం పై ప్రశ్నించారు, బీసీ వర్గాల ప్రాథమిక అవసరాలను పట్టించుకోలేదని ఆరోపిస్తూ,రాజకీయ పోరాటాలలో బీసీ వర్గాలను పావులుగా వాడుకుంటూ వారి పైనే దాడులు చేస్తున్నారు అని అన్నారు రాష్ట్రంలోని బీసీ కులాల జీవితం, గౌరవం ప్రశ్నార్థకంగా మారుతోందని వారి సంక్షేమం పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం విస్మరించిందని చేనేత సహకార సంఘాలకు వాగ్దానం చేసిన పన్ను మినహాయింపులను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం
చెందడమే కాకుండా బీసీల కోసం వాగ్దానం చేసిన రూ.10,000 కోట్ల వార్షిక స్వయం ఉపాధి నిధిని పూర్తిగా అమలు చేయలేదని సనపల రవీంద్ర భరత్ విమర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments