గ్రామస్థుల సమస్యలకు గ్రామంలోనే పరిష్కారం.
అల్లూరి జిల్లా
ఎమ్. మాకవరం గ్రామపంచాయతీలో నేడు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామస్థుల భూ సమస్యలు, ఆదాయ సంబంధిత ఇబ్బందులను పరిష్కరించే లక్ష్యంతో ఈ సదస్సును అధికారులు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మురళి బాబు, ఆర్ఐ రాజన్న దొర మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొని ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు.గ్రామస్థులు భూమి పట్టాదారు పాస్‌బుక్స్, అడంగల్, 1-బి రికార్డుల్లో ఉన్న లోపాలు, భూ వివాదాలు, వారసత్వ మార్పులు, ఆక్రమణలపై తమ సమస్యలను తెలియజేశారు.అధికారులు సమస్యలను పరిశీలించి, కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కారం చూపగా, మరికొన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. అలాగే రేషన్ కార్డులు, పింఛన్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలపై వచ్చిన వినతులను కూడా స్వీకరించారు.ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా గ్రామంలోనే సేవలు అందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడా చిన్నతల్లి రాజుబాబు, పెసా అధ్యక్షులు కొర్రు బంగారయ్య, వైసీపీ నాయకులు పొడుగు సూరిబాబు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
