Home Politics Andhra Pradesh 67 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు

67 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు

0

నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆర్థిక సహాయం అందజేశారు.
నిడదవోలు పట్టణం, మండలం, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు చెందిన మొత్తం 67 మందికి రూ.24 లక్షల 53 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను వేలివెన్ను గ్రామంలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో 908 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 కోట్ల 66 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయించి లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.
భవిష్యత్తులో కూడా నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తమవంతు సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version