Saturday, April 25, 2026
HomePoliticsAndhra Pradeshనిడదవోలులో ఘనంగా ఛత్రపతి శివాజీ 396వ జయంతి వేడుకలు

నిడదవోలులో ఘనంగా ఛత్రపతి శివాజీ 396వ జయంతి వేడుకలు

హిందూ సామ్రాజ్య స్థాపకుడు, ధైర్యసాహసాల ప్రతీక అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా నిడదవోలులో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిడదవోలు పట్టణ అధ్యక్షుడు మోర్త ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి శివ నాగరాజు హాజరై శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ దేశభక్తి, పరాక్రమం, పరిపాలనా నైపుణ్యం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. దేశ స్వాభిమానాన్ని కాపాడేందుకు ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు.
ఈ కార్యక్రమంలో బోరుగుపల్లి శివరామకృష్ణ, దేవుని పాపారావు, టంగుటూరి శ్రీనివాస్, బలిజేపల్లి సూర్యనారాయణ, రామచంద్రరావు, సురేష్ శాస్త్రి, లక్కోజు సాయి సూర్య, బోర్లా హైమావతి కుమారి, గుడ్ల గోవింద్, బోడపాటి శ్రీనివాస్, రంగా వెంకటేశ్వరరావు, నీలం రామారావు, కాసకాని సతీష్ తదితరులు పాల్గొన్నారు. శివాజీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయజయధ్వానాలు చేశారు.
కార్యక్రమం దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments