Wednesday, February 11, 2026
HomePoliticsAndhra Pradeshచంద్రబాబు, పవన్ కళ్యాణ్ జత రాష్ట్రాన్నికి అరిష్టం

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జత రాష్ట్రాన్నికి అరిష్టం

శ్రీవారి భక్తులకు చంద్రబాబు అండ్ కో మోకరిల్లి క్షమాపణ చెప్పాలి! ప్రభుత్వ భూమి గీతం కబ్జాకు రెగ్యులైజేషన్ చట్ట విరుద్ధం కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారికి పూజలువాసుపల్లి ఆధ్వర్యంలో అల్లిపురం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ పాపాన జతకట్టారో అప్పటి నుండి రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ 33వ వార్డ్ అల్లిపురం వెంకటేశ్వర మెట్ట, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వాసుపల్లి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి, గుడి బయట కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ప్రతి ఇంటికి కొబ్బరికాయ పూజ సామాగ్రి నీ ప్రజలకు అందజేసి రాష్ట్రానికి పట్టిన అరిష్టం పోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామికి శాంతి పూజలు చేయాలని కోరారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు, పాపాలకు రాష్ట్రంలో ఎటువంటి నష్టం జరగకుండా వెంకటేశ్వర స్వామికి పూజలు చేయమని, ఇంటింటికి వెళ్లి కొబ్బరికాయలు అందజేశామన్నారు. కూటమి నేతలు తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చేసిన ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన సిబిఐ చార్జీషీట్లో స్పష్టం చేయడం జరిగిన ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భయం, భక్తి లేకుండా దేవున్ని రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే కోట్లాదిమంది భక్తులు పవిత్రంగా భావిస్తారని అయోధ్య రామాలయానికి 20 కోట్ల లడ్డూలు పంపితే, నకిలీ లడ్డులు పంపించారని పవన్ కళ్యాణ్ దైవత్వంపై మచ్చ వేశారని దుయ్యబట్టారు. దేవదేవునిపై లేనిపోని మచ్చ వేయడం 100 సంవత్సరాల దేశ చరిత్రలో ఇదే ప్రథమం అని తెలిపారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ ఒప్పుకోకుండా పవన్ కళ్యాణ్ ఇంకా రంకెలు వేస్తున్నారన్నారు. వీరి అరిష్టము వలన అలిపిరి, సింహాచలం, కాశీబుగ్గ దేవాలయాల్లో ప్రమాదాలు జరిగి భక్తులు మరణిస్తున్న ఘటనలు చూస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత, అన్యాయం జరిగితే ప్రశ్నించే బాధ్యత మాపై ఉందని స్పష్టం చేశారు. గీతం యూనివర్సిటీ 54 ఎకరాల భూమి దౌర్జన్యం చేసి అక్రమంగా కబ్జా చేయగా, రెగ్యులైజేషన్ చేయడం చట్ట విరుద్ధమన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు సెంటు భూమి చొప్పున ఇస్తామని ఇప్పటికే ప్రకటించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిది కొండ రాజీవ్ గాంధీ, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు బిపిన్ కుమార్ జైన్, తోట పద్మావతి, చెన్నా జానకిరామ్, దక్షిణ వైసిపి వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments