బుచ్చయ్య పేట జయ జయహే
మండలంలోని వడ్డాది గ్రామానికి ఆదివారం ప్రముఖుల తాకిడి పెరిగింది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్, అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు కుమారుడు వంశీ, పూజిత దంపతుల వివాహ రిసెప్షన్ స్థానిక తిరుమల కన్వెన్షన్లో నిర్వహించారు.ఈ రిసెప్షన్ వేడుకకు వివిధ ప్రాంతాల నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ హోంమంత్రి ప్రస్తుత పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, ఎమ్మెల్యేలు కేఎస్ఎన్ఎస్ రాజు, సుందరపు విజయ్ కుమార్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, స్టేట్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద, స్టేట్ కొప్పులు వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివీజీ కుమార్, డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, తదితర ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు వివిధ ప్రాంతాల నుండి స్థానిక ప్రజాప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు హౌసింగ్,ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రముఖుల రాక సందర్భంగా వడ్డాది సందడిగా మారింది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

