Thursday, May 7, 2026
HomePoliticsAndhra Pradeshలడ్డు అంశాన్ని డైవర్ట్ చేయడానికి కుల రాజకీయాలు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు సరికాదు

లడ్డు అంశాన్ని డైవర్ట్ చేయడానికి కుల రాజకీయాలు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు సరికాదు

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఢిల్లీలో ఎంపీల బృందం సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఎంపీ సానా సతీష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

గతంలో జగన్ మోహన్ రెడ్డి సతీమణిపై తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే తక్షణమే అరెస్ట్ చేయడం జరిగింది. అదే మా పార్టీ నిబద్ధతకు నిదర్శనం. మహిళల పట్ల ఎలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయకూడదని మా పార్టీ నాయకత్వం మాకు స్పష్టమైన క్రమశిక్షణ, శిక్షణ ఇచ్చిందన్నారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక పార్టీ నాయకుడిని, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని అత్యంత దారుణంగా దూషించడం సభ్య సమాజానికి తగిన ప్రవర్తన కాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ ప్రోత్సహిస్తున్నట్టుగా వ్యవహరించడం విచారకరమని వ్యాఖ్యానించారు.

లడ్డు అంశంలో తప్పు బయటపడడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి కుల రాజకీయాలను తెరపైకి తీసుకొస్తున్నారు. అందుకే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పడం లేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఒక అంశాన్ని వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే—వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు కులాన్ని ముందుకు తెచ్చి హైలైట్ చేస్తున్నారని, నేరాలు చేసే వారిని, ఘోరాలకు పాల్పడే వారిని, హత్యలు చేసే వారిని కులం చూసి తేల్చరని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌సీపీ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ఈ విషయంలో కూడా ప్రయోగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇటువంటి అంశాలను లేవనెత్తడం వల్ల వారే దిగజారుతారు తప్ప, ఆ కులం ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అండగా నిలవదని తేల్చి చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments