అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ మన ట్రైబల్ హాస్టల్, కపారాడ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. రవి కుమార్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు చెడు వ్యసనాలకు, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మీరంతా బాగాచదువుకొని మీ కుటుంబనికి, మీ గ్రామాలకు మంచి పేరు తీసుకొని రావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాని కార్యదర్శి కటారి శోభన్ కుమార్ మాట్లాడుతూ మీరంతా భవిష్యత్తులో ఉన్నత స్థాయి కి వెళ్లాలని చెప్పారు. ట్రెజరర్
సీస శోభన్ , సమ రెడ్డి బాల గంగాధర్ తిలక్, వాంతల ఆనంద్, కోటి బాబు తదితరులు పాల్గొన్నారు.
