గురు శ్రీ సంత్ రవిదాస్ ఆదర్శనీయులు భగవాన్ సంత్ రవిదాస్ 649 జయంతి సందర్భంగా బిజేపి పార్టీ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు నితిన్ నబీన్ పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు గాజువాక లో చర్మకారులను శాలువాతో సత్కరించి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ సంత్ రవి దాస్ స్వామి చిత్రపటాన్ని అందచేసారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
విశాఖ జిల్లా ఎస్.సి మోర్చా అధ్యక్షులు ములకలపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం కొత్త గాజువాక మండలం శ్రీకన్య థియేటర్ దగ్గరలో మరియు పంతులుగారి మేడ ఎదురుగా ఉన్న చర్మకారులైన (చెప్పులు కుట్టే ) అప్పారావు ,కొండలరావుకు ప్రముఖ ఆథ్యాత్మిక గురు శ్రీ సంత్ రవిదాస్ చరిత్రను తెలియజేసామని అన్నారు. అనంతరం వారిని సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసారు. ములకలపల్లి ప్రకాష్ మాట్లాడుతూ గురు శ్రీ సంత్ రవిదాస్ చెప్పులు కుట్టుకునే సామాన్య వ్యక్తి అని అన్నారు. భగవద్గీత రామాయణం యొక్క విశిష్టతను అందరికీ డప్పు కొట్టి వీదుల్లో తిరుగుతూ భక్తి గీతాలు పాడుతూ సనాతన ధర్మాన్ని చాటిచెప్పిన గొప్ప ఆధ్యాత్మిక గురువు అని అన్నారు. వారి సేవలను ప్రధాని మోదీ గుర్తించి వారి జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న చర్మకారులను సత్కరించమని పిలుపునిచ్చారని తెలిపారు. కార్యక్రమంలో బిజేపి నాయకులు గూటూరు శంకరరావు , ఒమ్మి రంగనాయకులు, కొల్లి మనోహర్,నాగరాజు, గోపిరవిశంకర్,సూరిబాబు , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
