Home Politics Andhra Pradesh ఎవరిపైనా చర్యలుండవ్

ఎవరిపైనా చర్యలుండవ్

0

ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడటం చరిత్రలోనే లేదు

పాలకుడుగా.. నాయకుడుగా ఫెయిల్ అయ్యాడు

మూడేళ్లకే రూ. 3.30 లక్షల కోట్ల అప్పులా

సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో ఒంగోలు నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశమైన జగన్.. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై స్పందించారు. డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ పట్టుబడ్డారని అన్నారు. పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ఆయనేనని వ్యాఖ్యానించారు. పుట్టా మహేశ్ తో మొదలై పుట్టా మహేశ్ తోనే ఆగిపోలేదన్నారు. ఇలాంటి వారి పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు అత్యంత దారుణం అన్నారు. చంద్రబాబు ఒక పాలకుడిగా వ్యవహరించలేదని, తప్పు చేసిన వారి పట్ల చర్యలు తీసుకోలేదని జగన్ ఫైర్ అయ్యారు. ”చంద్రబాబు పాలనలో అప్పులు రెండేళ్లకే 3 లక్షల 30 వేల కోట్లు దాటాయి. కానీ, ప్రజలకు మనం ఇంతకు ముందు చేస్తున్నా పథకాలన్నీ రద్దు అయిపోయాయ్. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మాటలన్నీ కూడా మోసాలుగా తేలిపోయాయి. బటన్లు లేవు ప్రజలకు ఇచ్చిందీ లేదు. కానీ, అప్పులు చూస్తే భారీగా చేశారు. మన ఐదేళ్లలో చేసిన అప్పులకు ఈయన రెండేళ్లకే చేశారు. 3 లక్షల 30 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు చేసిన గ్రాస్ అప్పులు. ఈ డబ్బు అంతా ఎవరి జేబులోకి పోతోంది. పుట్టా మహేశ్.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఏకైక పార్లమెంట్ సభ్యుడు. ఇంతవరకు పార్లమెంట్ చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ ఇలా దొరికిపోయిన వ్యక్తి పార్లమెంట్ చరిత్రలోనే లేదు. మహేష్ మొదటి సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాలేదు. చంద్రబాబు అనుసరించే వైఖరి నుంచి మొదలవుతుంది. మహేశ్ తో మొదలై మహేశ్ తోనే ఆగిపోలేదు. దీనికి ముందు చాలానే జరిగాయి. చంద్రబాబు వ్యవహరించిన తీరు ఎలా ఉంది? యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడా? ఒక పాలకుడు, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు చంద్రబాబులో ఉన్నాయా? అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ మనకు కనిపించేది ఏంటంటే.. చంద్రబాబు ఈ గుణాలు ఎక్కడా కనిపించవు” అంటూ జగన్ నిప్పులు చెరిగారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version