Home Politics Andhra Pradesh ఆసుపత్రి లో మెరుగైన వసతులు సమకూర్చాలి

ఆసుపత్రి లో మెరుగైన వసతులు సమకూర్చాలి

0

సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసారు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు జొన్నకోట చిన్న మూర్తి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఉన్న వంద పడకల ఆసుపత్రి చుట్టుపక్కల మండలాలలో ఇదే ప్రధాన వైద్యాలయం, ఇలాంటి వైద్యాలయంలో కనీస సౌకర్యాలు లేక వచ్చిన రోగులు మరియు బంధువులు ఇబ్బంది పడుతున్నారు, ఇటీవల జరిగిన సంఘటన లో సమయానికి జనరేటర్ లేక ఒక పసికొందు మరణించడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చే రోగులు మరియు బంధువులకు వసతులు కూడా లేక ఎండలోనే ఏ చెట్టు నీడను నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది ఇది చాలా బాధాకరం దీనిపై అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి టౌన్ వైస్ ప్రెసిడెంట్ చందాన కృష్ణ, జొన్నకోట ఉమా శంకర్ ప్రసాద ,సెక్రెటరీ పాల తీర్థపు రాజు, జాయింట్ సెక్రెటరీ ద్వారపూడి కృష్ణ, కసింకోట ఇంచార్జ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version