Friday, April 17, 2026
HomePoliticsAndhra Pradeshఈనెల 22న బీసీ సింహగర్జన – భారీగా తరలిరావాలని బీసీవై పిలుపు

ఈనెల 22న బీసీ సింహగర్జన – భారీగా తరలిరావాలని బీసీవై పిలుపు

విజయవాడలో ఈనెల 22న నిర్వహించనున్న “బీసీ సింహగర్జన” సభను విజయవంతం చేయాధలని భారత చైతన్య యువజన–బీసీవై పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజమహేంద్రవరం గోదావరి గట్టుపై జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సింహగర్జన గోడపత్రికను ఘనంగా ఆవిష్కరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీవై పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు అత్తిలి రాజు మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలు భారీగా హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర రాజకీయాల్లో బీసీవై పార్టీ మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు.
బీసీ కులగణన, 44 శాతం రిజర్వేషన్ అమలు, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పన వంటి ప్రధాన డిమాండ్లతో సింహగర్జన నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీవై స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తొర్లపాటి సీతల్, రాష్ట్ర మహిళా కో-కన్వీనర్ ఆర్. నాగేశ్వరి శ్రీ, రాష్ట్ర కన్వీనర్ మారిశెట్టి సూరిబాబు, నగర కన్వీనర్ వనుము శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా యూత్ కన్వీనర్ నీలపాల సాయి మణికంఠ, యాత్ర కో-కన్వీనర్ జె. లక్షణ్, గోపాలపురం కన్వీనర్ నాచు ప్రభాకర్, నిడదవోలు కో-కన్వీనర్ రాచూరి వందు, ఉండ్రాజవరం మండల కో-కన్వీనర్ తాళం రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
సింహగర్జన సభ ద్వారా బీసీ వర్గాల హక్కుల సాధనకు బలమైన స్వరాన్ని వినిపించనున్నట్లు నాయకులు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments