Wednesday, June 17, 2026
HomeUncategorizedపేదల ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలి

పేదల ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలి

సైబర్ మోసాలకు గురి కాకుండా అవగాహన కల్పించాలి
– కలెక్టర్ హరేందిర ప్రసాద్

ప్రజల ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశపు హాల్లో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (బ్యాంకర్ల సమావేశం) జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతికి కోసం చేస్తున్న పథకాలకు అనుగుణంగా ఔత్సాహికులకు రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ అన్నారు. విద్యా రుణాలు, ఎం ఎస్ ఎం ఈ, లకు, పి ఎం స్వానిధి పథకాలకు , ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కింద విరివిగా రుణాలు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. పీఎంఈజీపి రుణాలు అందించడంలో అన్ని బ్యాంకులు లక్ష్యాలు సాధించాలన్నారు. టిట్కో గృహాలకు పెండింగ్ ఉన్న రుణాలను త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలన్నారు. సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయాలని అన్నారు. మార్చి 8న జరిగే మహిళా దినోత్సవం నాటికి ఎం ఎస్ ఎం ఈ యూనిట్ల కు రుణాలు మంజూరు చేసి గ్రౌండ్ చేయడానికి కృషి చేయాలని బ్యాంకర్లు ,ఇండస్ట్రీస్ అధికారులకు సూచించారు. యు సి డి, డి ఆర్ డి ఏ అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్ హెచ్ జి మహిళలు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రుణాల మంజూరులో సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. సైబర్ మోసాల పై ప్రజల్లో అవగాహన కల్పించాలి. రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్నాయని,ఖాతాదారులు మోసాలకు గురికాకుండా అప్రమత్తం చేయాలని, సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగే సమయంలో బ్యాంకులు సున్నితంగా పరిశీలన చేయాలన్నారు. సైబర్ మోసాలు గురైన వారికి అండగా నిలవాలని అన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ 74 వేల 317 కోట్లతో జిల్లా రుణ ప్రణాళిక లక్ష్యం కాగ 81 వేల కోట్లు రుణాలు అందించి లక్ష్యాన్ని అధిగమించి 110శాతం లక్ష్యం సాధించామన్నారు. .
ఈ సమావేశంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు నాబార్డ్ మేనేజర్ సమంత కుమార్, ఆర్.బి.ఐ ఎల్ డి ఓ నవీన్ కుమార్ పిడి డిఆర్డిఏ లక్ష్మీపతి పిడి యు సిడి సరోజినీ ,జిఎం ఇండస్ట్రీస్ ఆదిశేషు ,జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి మత్స్య శాఖ జెడి లక్ష్మణరావు పలు బ్యాంకుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments