Tuesday, April 21, 2026
HomePoliticsAndhra Pradeshటెక్కలి లో చెత్త రహదారులు

టెక్కలి లో చెత్త రహదారులు

పంచాయితీ వాళ్లు చూడరు జనo ఇక్కట్లు తీరవు జిల్లా స్వచ్ఛభారత్ కన్వీనర్ లింగరాజు శ్రీకాకుళం జిల్లా రెండవ జిల్లా కేంద్రంగా పిలవబడుతున్న టెక్కలి ప్రధాన రహదారులతో పాటు ప్రతి వీధిలోనూ చెత్త స్థానికులు యదేచ్చంగా నడిచిన రహదారులపైనే చెత్త వేయడం ఆవేదన కలిగిస్తుందని పంచాయతీ అధికారులు చూడరు జనం చెత్త వేయడం మానరు అనే విధంగా ప్రధాన రహదారులన్నీ డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. ప్రతి వీధిలో చెత్తకుండీలు ఏర్పాటు చేయకపోవడం వల్లే చెత్త పేరుకు పోతుందని , దీనికి తోడు జాతీయ రహదారి 16 ఇరువైపులా పట్టణంలోని చికెన్ షాపులు, ఇతర వ్యాపారాలు చేస్తున్న వారంతా చెత్తను తీసుకొచ్చి రహదారులు, వీధి కాలువల్లో పడి వేయడం బాటచారులు, ప్రయాణికులు, స్థానికులకు తీవ్రమైన కలుషితం కలిగి రోగాల బారిన స్థానికులు ఇబ్బందుల కు గురవుతున్నారని లింగరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు తక్షణమే స్పందించి పర్యావరణ పరిరక్షణకు, స్థానిక మురికి వీధుల పారిశుద్ధ్యనికి తగిన కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments